రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఫిబ్రవరి 21న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గోవాలోని ఓ లగ్జరీ హోటల్ లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ హోటల్ వీరి పెళ్లికి వేదిక అయింది. గోవాలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ ఇది. ఒక్కో రూమ్ కు రూ.19 వేల నుంచి 75 వేల వరకు రెంట్ ఉంటుందట. ఈ వెడ్డింగ్ కోసం 3 రోజుల పాటు ఈ హోటల్ ను బుక్ చేసుకున్నారని సమాచారం.