కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు జరగనున్న ఈ సినిమా యొక్క ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ ని వెల్లడించారు.
ఉదయం 7:30 గంటలకు విజయవాడలోని కనక దుర్గ ఆలయ సందర్శన తర్వాత 10:30 గంటలకు గుంటూరులోని RVR మరియు JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మీట్ ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.