ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడాకులపై మరోసారి స్పందించిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 11:54 AM

కొన్ని నెలలుగా లకు దూరంగా ఉంటున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్ సమస్యకు ఇమ్యూనిటీ కోసం చికిత్స తీసుకున్న ఆమె ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అలాగే సిటాడెల్ డబ్బింగ్ పనిని కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు సొంతంగా పాడ్ కాస్ట్ ఛానల్ ప్రారంభించారు. మయోసైటిస్ కారణంగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను.. తీసుకున్న చికిత్స.. డైట్ ప్లానింగ్ గురించి తన అభిమానులతో పంచుకోనున్నారు. అలాగే ఆరోగ్యం గురించి పలువురు నిపుణులతో కలిసి అవసరమైన విషయాలను ప్రజలకు తెలియజేయనున్నారు. సామ్ హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ TAKE20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె అనారోగ్య సమస్యలు, చికిత్స, జాగ్రత్తలు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మరోసారి డివోర్స్ గురించి రియాక్ట్ అయ్యారు. తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైనదని.. అత్యంత కష్టమైన ఏడాది అంటే అదేనంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


 


TAKE 20 పాడ్ కాస్ట్ మొదటి ఎపిసోడ్‏లో ఆరోగ్య నిపుణులు అల్కేష్ తో ముచ్చటించింది సమంత. 'నాకు మయోసైటిస్ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది. ఎందుకంటే ఆ సంవత్సం చాలా కష్టతరమైనది. నా స్నేహితుడు, మేనేజర్ హిమాంక్ నేను ముంబై నుంచి తిరిగి ప్రయాణిస్తున్న రోజు ఇంకా గుర్తుంది. ఆ సంవత్సరం జూన్ లో నేను ప్రశాంతంగా ఉండాలని.. కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నాకు చెప్పాడు. కానీ అసలు ప్రశాంతంగా ఉండలేకపోయాను. కానీ మెల్లగా ఊపిరి పీల్చుకోగలిగాను. నిద్రించేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత నేను నా పనిపై దృష్టి పెట్టాను. కష్టమైన పరిస్థితుల నుంచి నేను మేల్కొన్నాను. ' అంటూ చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com