ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో జయం రవి తన కొత్త సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా తమిళ వెర్షన్ ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను గంగా ఎంటర్టైన్మెంట్స్కు చెందిన మహేశ్వర రెడ్డి మూలి దక్కించుకున్నారు. ఈ యాక్షన్ కమర్షియల్ మూవీ యొక్క తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 23న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
ఈ చిత్రంలో జయం రవి సరసన బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. హోమ్ మూవీ మేకర్స్‌పై సుజాత విజయ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.