శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో నటి హన్సిక మోత్వాని నటించిన ఇటీవలి థ్రిల్లర్ 'మై నేమ్ ఈజ్ శ్రుతి' నవంబర్ 17, 2023న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్తో పాటు, తమిళ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.
థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రేమ, మురళీ శర్మ, పూజా రామచంద్రన్, రాజా రవీంద్ర, ప్రవీణ్, అడుకులం నరేన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందించారు.