పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో శివ కందుకూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి భూతద్దం భాస్కర్ నారాయణ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా సెన్సార్ ఫార్మిలీటీస్ క్లియర్ చేసుకొని UA సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సినిమాలో శివకి జోడిగా రాశి సింగ్ నటిస్తుంది. ఈ చిత్రం మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో చాయ్ బిస్కెట్ ఫేమ్ నటుడు అరుణ్ కుమార్‌తో పాటు దేవి ప్రసాద్, వర్షిణి సౌందర్‌రాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ మరియు కల్పలత తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని స్నేహల్ జంగాలా, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించారు. గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫీ మరియు రోషన్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ అందించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మరియు విజయ్ బుల్గానిన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.