శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D 51 అనే పేరును పెట్టారు. ఈ యాక్షన్ డ్రామాకి 'ధారవి' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం. ముంబయిలోని ధారవిలో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మార్చి 8న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.