టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమెన్స్ డే సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అంజలి అండ్ గ్యాంగ్ కొడవళ్లతో ఉన్న పోస్టర్ అది. అంతేకాక త్వరలో థియేటర్లలోకి అంటూ మేకర్స్ పోస్ట్‌ను షేర్ చేశారు.