మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 'ఉప్పెన' సినిమాతో పేరుగాంచిన దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి ఆయన కొత్త సినిమా (RC 16)కి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్, చిత్ర కథానాయిక జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. బోనీకపూర్, చిరంజీవి, శంకర్ షణ్ముగం, నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, సుకుమార్, వెంకట సతీష్ కిలారు, అల్లు అరవింద్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.