క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఘాటీ' అనే టైటిల్ ని లాక్ చేసారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ప్రస్తుతం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి సరసన తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించనున్నట్టు సమాచారం. ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో నిర్మిస్తుంది.