జయకృష్ణ - చాందిని జంటగా ‘ఆలకాలం’ పేరుతో ఒక చిత్రం రూపుదిద్దుకుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో తల్లి పాత్రలో సీనియర్ నటి ఈశ్వరీరావు మరోమారు వెండితెరపై మెప్పించనున్నారు. ఇతర పాత్రల్లో దీప, బాబా భాస్కర్, తంగదురై, కోదండం, సిజర్ మనోహర్ తదితరులు నటించారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు కలగలిసిన చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు ఏ ఒక్కరి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయని జయకృష్ణ.. తొలిసారి దర్శకత్వం వహించారు. గతంలో కూడా లోకేష్ కనకరాజ్, ఉరియడి విజయకుమార్, కార్తీక్ నరేన్ వంటివారు కూడా ఇదే జాబితాలోకి వస్తారు. కె.సత్యరాజ్ కెమెరామెన్, ఎన్.ఆర్.రఘునందన్ సంగీతం అందించారు.