నవాజుద్దీన్ సిద్ధిఖీ హిందీ చిత్రసీమలో టాప్ స్టార్ నటులలో ఒక్కరు. కానీ అతని భార్య ఆలియాతో అతని సంబంధం చాలా కాలంగా బాగా లేదు. భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తుండగా, అతనిపై భార్య చాలా కోర్టు కేసులు వేసింది. అయితే తాజాగా అందిన సమాచారం ఏంటంటే... ఈ జంట ఒక్కటయినట్లు సమాచారం. ఆలియా నవాజ్ మరియు ఆమె పిల్లలతో తిరిగి నవాజ్ వద్దకు వెళ్లిపోయిందని ముంబై మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబం యొక్క స్నాప్‌లను కూడా పోస్ట్ చేసింది.