సామాజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో శర్వానంద్ ఒక సినిమాకి సంతకం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా గ్లామర్ బ్యూటీ సంయుక్త మీనన్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సాక్షివదియ కీలక పాత్రలో కనిపించనుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రానికి నారి నారి నడుమ మురారి అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారక ప్రకటన రావలిసి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.