యామీ గౌతమ్ ఇటీవల పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆర్టికల్ 370తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు మరియు ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన స్వయంప్రతిపత్తిపై ఆధారపడింది. యామీ గౌతమ్ నటించిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఆదిత్య సుహాస్ జంభలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియమణి, అరుణ్ గోవిల్, రాజేంద్రనాథ్ జుట్షి, దివ్య సేథ్ మరియు ఐరావతి హర్షే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జ్యోతి దేశ్పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా ఆర్టికల్ 370ని రూపొందించారు.