గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్లో తన పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. నటి తదుపరి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (JSK) అనే మలయాళ చిత్రంలో కనిపించనుంది. ఈ లీగల్ థ్రిల్లర్లో ప్రముఖ నటుడు సురేష్ గోపి లాయర్ పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా అనుపమ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఈ చిత్రానికి తన డబ్బింగ్ పూర్తయినట్లు ప్రకటించింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ప్రొడక్షన్ టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయింది.
ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ గోపి తనయుడు మాధవ్ సురేష్తో పాటు శృతి రామచంద్రన్, దివ్య పిళ్లై, అస్కర్ అలీ, బైజు సంతోష్, కొట్టాయం రమేష్, షోబీ తిల్కన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.