లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రం 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.