విలక్షణ నటుడు షాయాజీ షిండే ఆసుపత్రిపాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించి, యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. గతంలోనూ ఒకసారి షిండే ఛాతీనొప్పికి గురయ్యారు.