హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయినా.. కాజల్ మాత్రం తగ్గేది లేదంటోంది. కండీషన్స్ అప్లై అంటుంది. ఇంతకీ.. కాజల్ పెడుతున్న కండీషన్లు ఏంటంటే..? హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్లపైగా వెలుగు వెలిగిందికాజల్.. టాలీవుడ్ తో పాటు.. తమిళ సినిమాల్లో కూడా మెరిసింది బ్యూటీ. ఆమె ఎక్కువగా టాలీవుడ్ సినిమాలే చేసింది. తెలుగులో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది కాజల్. ఎన్టీఆర్, చరణ్ లాంటి యంగ్ స్టార్స్ తో పాటు.. పవన్, మహేష్, చిరు, బాలయ్య లాంటి సీనియర్ తారలతో కూడా నటించింది బ్యూటీ. ఇక కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తరువాత కాలంలో సినిమాలు తగ్గడంతో.. ఇక ఏమాత్రం ఆలోచించకుండా.. సినిమాలు చేస్తున్నటైమ్ లోనే.. తన చిన్ననాటి స్నేహితుడు.. తరువాత కాలంలో ప్రేమికుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్ళాడి.. వెంటనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. సినిమాలు చేస్తుండగానే కాజలు ఇలా గ్యాప్ తీసుకుంది. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతుంది కాని.. అప్పటిలా పెద్దగా అవకాశాలు లేవు బ్యూటీకి. అయితే సినిమాలు చేయడం అయితే చేస్తుంది కాని.. ఆమె కండీషన్లు ఓప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తానంటుందట కాజల్.. మరీ ముఖ్యంగా నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందట కాజల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పెడుతున్న కొత్త కండిషన్స్ మేకర్లకు డైరెక్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయట. అటు నిర్మాతలకు కూడా చెమటలు పట్టించేస్తుందట కాజల్. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్ రొమాంటిక్ సీన్స్ విషయంలో మాత్రం కండీషన్స్ అప్లై అంటోందట. ఈ విషయంలో తన నిర్ణయం మారదని తెగేసి చెప్పేస్తుందట. సినిమా ఏది అయినా.. తన పరిధి దాటి చేయనంటోందట. ముఖ్యంగా లిప్ లాక్ లు, రొమాంటిక్ సీన్స్ , బెడ్ సీన్స్ ను అస్సలు చేయనంటోందట కాజల్. అంతే కాదు ఎక్స్పోజింగ్ పాత్రలు కూడా ఆమె నో చెపుతోందట. అవసరమైతే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను కాని... ఆ పని మాత్రం చేయను అంటోంది కాజల్ అగర్వాల్. ఇక ఈ విషయంలో ఏం చేయాలో తెలియక.. మేకర్స్ తలపట్టుకుంటున్నారట. అయితేఆమెకు ఇప్పటికీ ఫాలోయింగ్ బాగా ఉండటంతో మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. కాని వాటిని ఆమె కండీషన్స్ తో పోగొట్టుకుంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.