టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతను చివరిగా బెదురులంక చిత్రంలో కనిపించాడు మరియు తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా ఇప్పుడు కార్తికేయ తదుపరి చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు రివీల్ చేసారు.
ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అని టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తికేయ చేతిలో క్రికెట్ బ్యాట్‌తో నడుస్తున్నట్లు కనిపించారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa