బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన కెరీర్‌లో చాలా కష్టపడి పైకి వచ్చింది. బాహుబలిలో స్పెషల్ సాంగ్ లో చేసిన తరవాత ఆమె అప్పటి నుంచి హిందీ చిత్రసీమలో స్టార్ గా నిలిచింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. కొంతమంది హిందీ తారలు బాలీవుడ్‌లో తమ పరిచయాలను పెంచుకోవడానికి మాత్రమే పెళ్లి చేసుకుంటారని నోరా తన ఇంటర్వ్యూలో పేర్కొంది.
జంట మధ్య ప్రేమ ఉండదని, వారు చేసేదంతా మరింత పెరగడం కోసం ఒకరి పరిచయంపై మరొకరు ప్రయాణించడమేనని ఆమె చెప్పింది. నేను నా పరిశ్రమలో చూస్తున్నాను, ప్రజలు పలుకుబడి కోసం పెళ్లి చేసుకుంటారు. ప్రజలు ఈ భార్యలు లేదా భర్తలను నెట్‌వర్కింగ్ కోసం మరియు సర్కిల్‌ల కోసం, డబ్బు కోసం ఉపయోగిస్తారు అని చెప్పింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.