విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిశారు. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి సమావేశమైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రతినిధులు చిరంజీవికి తెలిపారు.