మలయాళీ హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ నెటిజన్ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఆమె ఈరోజు ఉదయం ట్విటర్లో ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'గ్లామర్ షో ఆపి నటించడం ఎప్పుడు మొదలుపెడతావు?' అని ప్రశ్నించారు. అందుకు ఆమె 'ఎప్పటికీ నటించను. నీకేమైనా సమస్యా?’ అంటూ జవాబిచ్చారు. ఇక సమంత, అనుష్క తనకు ఇష్టమైన హీరోయిన్లని, హృతిక్ రోషన్ తొలి క్రష్ అని ఇతర ప్రశ్నలకు సమాధానమిచ్చారు.