చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'సిద్దర్ద్ రాయ్'. ఈ సినిమాని డైరక్టర్ యశస్వి తెరకెక్కించారు. ఈ సినిమాలో దీపక్ సరోజ్ కి జోడీగా తన్వి నెగి హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్స్ లో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 3 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్నీ ఆహా ఓ పోస్టర్ రూపంలో అధికారికంగా తెలియజేసింది. థియేటర్స్ వద్ద నిరాశ పరచిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.