జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయిన రష్మి తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం అది వైరల్ అవుతుం.రష్మి గౌతమ్.. జబర్దస్త్ యాంకర్‌గా రాణిస్తూ బిజీగా ఉంది. షో ప్రారంభమైనప్పట్నుంచి దాన్నే నమ్ముకుని ఉంది. అంతేబాగా ఆకట్టుకుంటూ రాణిస్తుంది. అయితే రష్మి గౌతమ్ కి చాలా సామాజిక స్పృహ ఎక్కువ. ముఖ్యంగా ఆమె యానిమల్ లవర్. డాగ్స్ లవర్‌గా రాణిస్తుంది. ఏ కుక్కకి ఏమైనా తాను తట్టుకోలేదు. మూగ జీవాలపై హింసని ఆమె వ్యతిరేకిస్తూ వస్తుంది. మనుషుల్లాగే వాటిని చూడాలని చెబుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వాటికి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే దానిపై కామెంట్ చేస్తూ చర్చకి తెరలేపుతుంది. ఇష్యూ రైజ్ చేస్తూ తనవంతుగా సామాజిక బాధ్యతని చాటుకుంటుంది రష్మి గౌతమ్. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. మహిళ, సెక్స్ అనే అంశాలకు సంబంధించిన రష్మి పోస్ట్ ఆలోచింప చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో దీన్ని పంచుకుంది రష్మి. ప్రముఖ రైటర్ రచెల్ మోరన్ రాసిన కోట్‌ని స్టోరీలో షేర్ చేసింది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన విషయం ఉండటం విశేషం. `మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్ పెట్టాలి, కానీ `డిక్` కాదు అని రచెల్ మోరన్ రాసిన కోట్‌ని మరో రైటర్ పంచుకోగా, ఆ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది రష్మి. ఇందులో మరో ఆసక్తికర విషయం దాగుంది. చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు. దాని మనుగడ ఉండదని తెలిపింది. మహిళల వ్యభిచారం, ఆకలి బాధలపై ఓ వేశ్య చెప్పిన డైలాగుని ఇలా పోస్ట్ ద్వారా వెల్లడించారు ఆ రైటర్. దాన్ని రష్మి తన స్టోరీలో పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇక రష్మి గౌతమ్.. జబర్దస్త్ షోకి యాంకర్‌గా దాదాపు 11ఏళ్లుగా రాణిస్తుంది. అనసూయ, రష్మిలు కొనసాగుతున్నారు. కానీ రష్మి రెండేళ్ల క్రితం షో నుంచి తప్పుకుంది. కానీ రష్మి కొనసాగుతుంది. తన అందంతో, అభినయంతో, ముద్దుముద్దు మాటలతో అలరిస్తుంది. వినోదాన్ని పంచుకుంది. `జబర్దస్త్` షోతోపాటు ఆమె `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా యాంకర్‌గా చేస్తుంది. ఇది అత్యంత రేటింగ్ సాధిస్తున్న తెలుగు షోగా రన్ కావడం విశేషం. రష్మి గౌతమ్.. సినిమాల్లోనూ మెరుస్తుంది. తాను సినిమాల కోసమే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ అక్కడ సర్వైవ్ కావడం కష్టమని భావించి బుల్లితెరని నమ్ముకుంది. జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్‌గా ఎదిగింది. స్టార్ హీరోయిన్ల రేంజ్ ఫాలోయింగ్‌ని సాధించింది. ఇప్పుడు ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్ రన్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa