టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మూన్‌షైన్ పిక్చర్స్ తో ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. విరూపాక్ష మరియు భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
సోషియో ఫాంటసీ డ్రామాగా రానున్న ఈ చిత్రం 50 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యినట్లు సమాచారం. లుధీర్ బైరెడ్డి అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa