చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తన కొత్త సినిమా తాండల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ తో చివరిగా విరూపాక్ష సినిమా తీసి హిట్ కొట్టిన కార్తీక్ వర్మ డైరెక్షన్ లో కూడా చైతు సైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు పూజా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa