ఒక్క సినిమా కూడా చేయకుండానే సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించింది సుప్రీత. తాజాగా ఓ స్టార్ హీరో భర్తగా కావాలని మనసులో కోరిక బయటపెట్టింది. సుప్రీత పోస్ట్ వైరల్ అవుతుంది. నటి సురేఖావాణి రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ కమెడియన్ గా ఆమె పాప్యులర్ అయ్యారు. రెడీ, దుబాయ్ శ్రీను, బాద్ షా, నమో వెంకటేశా చిత్రాల్లో సురేఖావాణి కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఈ మధ్య సురేఖావాణి జోరు తగ్గింది. గతంలో మాదిరి ఆఫర్స్ రావడం లేదు. భర్త మరణంతో ఆమె గ్యాప్ తీసుకున్నారు. తర్వాత లాక్ డౌన్ వచ్చింది. అలా ఓ రెండేళ్లు సురేఖావాణి సిల్వర్ స్క్రీన్ కి దూరం కావడంతో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. లాభం లేదని సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ చేసింది. హాట్ వీడియోలు, ఫొటో షూట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకర్షించింది. తనతో పాటు కూతురిని కూడా ఫేమస్ చేసింది. టీనేజ్ నుండే సుప్రీతను ఎంకరేజ్ చేసింది. ఆమెను సోషల్ మీడియా స్టార్ చేసింది. సుప్రీత తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.సుప్రీత హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.కాగా సుప్రీత తరచుగా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. వారితో ఆన్లైన్ చాట్ చేస్తుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు సహనంగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి ఆమె ఇంస్టాగ్రామ్ లో ముచ్చటించారు. ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ పెళ్లి కానీ హీరోల్లో ఎవరిని భర్తగా కోరుకుంటున్నావని అడిగారు. ఈ ప్రశ్నకు తడబడకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది సుప్రీత. రౌడీ హీరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని చెప్పింది. దాంతో విజయ్ దేవరకొండ మీద సుప్రీతకు అంత ప్రేమ ఉందా? ఆమె క్రష్ విజయ్ దేవరకొండ అని నెటిజెన్స్ ఆశ్చర్యం వ్ వ్యక్తం చేస్తున్నారు...