అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.
తాజా అప్డేట్ ప్రకారం, గుడ్ బ్యాడ్ అగ్లీ బృందం హైదరాబాద్ షెడ్యూల్లో అజిత్‌పై మాస్ ఇంట్రడక్షన్ సాంగ్ మరియు ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఈ చిత్రంలో అజిత్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తాడని, అతని పాత్రలలో ఒకటి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని లేటెస్ట్ టాక్.
గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.