ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం'

cinema |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 08:03 PM

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' చిత్రం గ్రాండ్ గా నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మే 13, 2024న ఉదయం 7 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.

అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa