బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి రాబోయే హిందీ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహిలో తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31, 2024న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను రేకెత్తించింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్ఫ్లిక్ భారీ మొత్తానికి పొందింది అని సమాచారం. అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, కుముద్ మిశ్రా, జరీనా వాహబ్ మరియు పూర్ణేందు భట్టాచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రొడక్షన్‌ని ధర్మ ప్రొడక్షన్స్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.