వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సరిపోద శనివారం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.