రొమాంటిక్ మరియు యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GVM) తన చివరి చిత్రం జాషువా: ఇమై పోల్ కాఖా బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిలిచింది. మరోవైపు, అతని భారీ అంచనాల చిత్రం ధృవ నక్షత్రం: చాప్టర్ వన్ - యుద్ధ కాండమ్ విడుదల అనిశ్చితంగా ఉంది.
మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టితో స్టార్ డైరెక్టర్ తన తదుపరి రాబోయే ప్రాజెక్ట్ ని చేస్తున్నట్లు సమాచారం. మమ్ముట్టి కంపానీ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో మమ్ముట్టికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.