ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జీ5 'తలైమై సేలగం' అనే రాజకీయ వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. రాడాన్ మీడియావర్క్స్ పతాకంపై రాధికా శరతుకుమార్ నిర్మించిన ఈ సిరీస్ కి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించారు.
ఈ వెబ్ సిరీస్ మే 17 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించింది.
రమ్య నంబేసన్, కని కుశ్రుతి, నిరూప్ నందకుమార్, దర్శ గుప్తా మరియు సారా బ్లాక్ ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతం సమకూర్చారు.