టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి కెఎల్ నారాయణ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ రూమర్ పై ప్రొడక్షన్ హౌస్ స్పందిస్తూ అధికారక ప్రెస్ నోట్ ని విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది.