టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య 2022లో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజుగా చై నటనను హిందీ సినీ ప్రేమికులు మెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్కినేని హీరో మాట్లాడుతూ.. ఇప్పుడు మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేసే ఆలోచన లేదని చెప్పాడు. అమీర్‌ఖాన్‌ను చూసి మాత్రమే తాను లాల్‌సింగ్ చద్దాను అంగీకరించానని చెప్పాడు. భవిష్యత్తులో తనకు మంచి పాత్రలు వస్తే తప్పకుండా హిందీ సినిమాలను చేస్తానని చై చెప్పాడు. ఏ భాషలోనైనా మంచి కంటెంట్‌ని ఆదరించటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని చై అభిప్రాయపడ్డారు.