కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకు ముందు తిరుమలను సందర్శించి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు. ఈ చిత్రం మే 31, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.