అఖండ 2 అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. నందమూరి బాలకృష్ణ తమ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన తమ గత చిత్రం అఖండ విజయం తర్వాత మరోసారి బోయపాటి శ్రీనుతో జోడీ కడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. తాజాగా ఇప్పుడు, బోయపాటి కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం యొక్క మొదటి డ్రాఫ్ట్‌ను ముగించినట్లు సమచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.