ఇటీవల ముంబైలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లి బేబీ బంప్‌తో దర్శనమిచ్చారు దీపికా పదుకొణె . తన భర్త రణ్వీర్ సింగ్ ఆమె ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చి తీసుకెళ్లారు. అయితే కొందరు మాత్రం అది నిజమైన బేబీ బంప్ కాదని, దీపిక సరోగసి విధానాన్ని ఎంచుకుందని అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ ఇటీవల మరోసారి బేబీ బంప్‌తో దర్శనమిచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తన సొంత ఫ్యాషన్ బిజినెస్ 82 ఈస్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో షేర్ చేసిన ఈ ఫొటోల్లో దీపిక ఎల్లో కలర్ గౌన్‌లో మెరిసింది ఫ్యాషన్ ప్రియులు కూడా దీపిక డ్రెస్ ను తెగ మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ దుస్తులను అమ్మేసిందీ బాలీవుడ్ నటి. సోమవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ దుస్తులు అమ్మకానికి ఉందని చెబుతూ ఒక ఫోటోను పంచుకుంది దీపిక. ఆ ఫోటో షేర్ చేసిన 20 నిమిషాల్లోనే ఎల్లో గౌన్ ఏకంగా రూ.34,000 అమ్ముడుపోయింది. దీంతో దీపిక వెంటనే ఎల్లో గౌన్ డ్రెస్ సోల్డ్ ఔట్ అని మరో ఫొటో షేర్ చేసింది. ఆ డ్రెస్ అమ్మగా వచ్చిన రూ.34,000 నగదును సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించనుంది దీపిక. ‘ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ పేరుతో నిర్వహిస్తోన్న చారీటీ సంస్థకు ఈ నగదును అంజేయనుంది దీపిక. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, నెటిజన్లు దీపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ మేడమ్ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. గర్భంతో ఉండడంతో దీపికా పదుకొణె ప్రస్తుతానికి కాస్త విరామం తీసుకుంది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదలకు సిద్థంగా ఉంది. దీనితోపాటు ‘సింగం అగైన్’ సినిమాలో కూడా దీపికా కీలక పాత్ర పోషిస్తోంది.