రచయిత భాస్కర్ శక్తి దర్శకుడిగా అవతారమెత్తి రూపొందించిన చిత్రం ‘వడక్కన్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌కు వెళ్ళగా, అక్కడ సమస్యలు ఎదురయ్యాయి. ‘వడక్కన్’ టైటిల్‌కు సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. తమిళనాడుకు ఉపాధి కోసం వలస వచ్చే ఉత్తరాది వలస కార్మికుల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించారు. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు.. టైటిల్ మారిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని తేల్చి చెప్పారు. ఉత్తర భారతీయులను కించపరిచేలా ఈ టైటిల్ ఉందని అందువల్ల పేరు మార్చాలని సూచించారు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర బృందం అప్పీల్ చేసినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన విడుదలకావాల్సిన ఈ చిత్రాన్ని మరో తేదీకి వాయిదా వేశారు. ఈ మూవీలో కుంకుమ్ రాజ్, వైరమాలా , ప్రవేశ్ మెహ్రూ, సమీరా తదితరులు నటించగా డిస్కవరీ సినిమాస్ పతాకంపై ఎం.వేడియప్పన్ నిర్మించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa