జాన్వీ కపూర్ సోదరి కుషీ కపూర్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడితో ఒక చిత్రానికి సంతకం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఖుషీ, జునైద్ ఖాన్‌లతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన లవ్ టుడే చిత్రానికి అఫీషియల్ రీమేక్. తమిళం, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రానికి హిందీలో లవ్ యాప అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa