రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో యంగ్ హీరో తిరువీర్ నటించిన 'పరేషన్' చిత్రం జూన్ 2, 2023న విడుదల అయ్యింది. కామెడీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ ఫన్ ఫ్లిక్ విడుదలయ్యి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటించింది. ఈ సినిమాలో బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెరా ఖాన్, రవి మరియు రాజు బెడిగల కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పించగా వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. యశ్వంత్ నాగ్ ఈ చిత్రాన్ని సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa