ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అరణ్మనై 4' డిజిటల్ అరంగేట్రంకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 07:05 PM

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన 'అరణ్మనై 4' హారర్-కామెడీ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని సింప్ల్య్ సౌత్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 21న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్  ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa