బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. టిల్లు స్క్వేర్ తర్వాత ఆమె వరుస సినిమాలను ప్రకటించింది. తాజాగా నటి కొత్త దర్శకుడు AR జీవా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లాక్డౌన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఎమోషనల్ డ్రామాగా రానున్న ఈ చిత్రం యొక్క టీజర్ ని విడుదల చేసారు. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది. ఎన్ఆర్ రఘునాథన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించగా, కెఎ శక్తివేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.