ఇటీవల పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో పలువురు రాష్ట్ర, జాతీయ నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారు. ఈ చిరస్మరణీయ వేడుకకు పవన్ పిల్లలు అకిరా నందన్ మరియు ఆద్య కూడా హాజరు అయ్యారు. అకీరా మరియు ఆద్యల తల్లి రేణు దేశాయ్ కొద్దిసేపటి క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు జనసేన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ రాష్ట్రానికి మరియు సమాజానికి మంచి చేయాలనే కళ్యాణ్ గారి కోరిక కోసం శుభాకాంక్షలు అని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో రాశారు. రేణు తన పిల్లలు, అకీరా మరియు ఆద్యల వీడియోను కూడా పంచుకున్నారు.