బాలీవుడ్ నటి రవీనా టాండన్ తాజాగా ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టుకు పరువు నష్టం నోటీసు పంపింది. ఈ విషయాన్ని రవీనా లాయర్ సనా రయీస్ ఖాన్ తెలిపారు. 'రవీనాను తప్పుడు, పనికిమాలిన ఆరోపణలో ఇరికించే ప్రయత్నం జరిగింది. ఇది CCTV ఫుటేజీలో స్పష్టమైంది. అయినప్పటికీ ఆ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి రవీనాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే పరువు నష్టం నోటీసు పంపించాం' అని ట్వీట్ చేశారు.