ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక నటించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది.