"విరూపాక్ష" మరియు "బ్రో" వంటి బ్లాక్ బస్టర్ విజయాల తరువాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ యొక్క తాజా పాన్ ఇండియా చిత్రం అధికారికంగా ప్రారంభించబడింది. "విరూపాక్ష" మరియు "బ్రో" చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో చేరిన తర్వాత సాయి దుర్ఘా తేజ్ ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను ఈరోజు నిర్మాతలు విడుదల చేశారు. ల్యాండ్మైన్లతో నిండిన ఎడారి ప్రకృతి దృశ్యం మధ్య పచ్చని చెట్టును కలిగి ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. నిర్మాతలు మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇది పీరియడ్ హై అడ్రినలిన్ యాక్షన్ డ్రామా సాయి దుర్ఘ తేజ్ పాత్ర అనూహ్యంగా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ప్రస్తుతం తొలి షెడ్యూల్ జరుగుతోంది అని చెప్పారు. 'SDT 18' పేరుతో ప్రకటించబడిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది.