'సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి' అంటూ ప్రశ్నించిన నెటిజన్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. 'ఇలాంటి వివక్షలు వద్దు. మీరు మమ్మల్ని ఇడ్లీ, సాంబార్ అని అనడం మంచిది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు' అని ఘాటు రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటులు దక్షిణాది యాక్టర్లను చిన్న చూపు చూస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.