కల్కి 2829 AD చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా కష్టపడ్డాడు. ఈ కథను రాసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దాదాపు మూడేళ్లు చిత్రీకరణకు సమయం పట్టింది. ట్రైలర్ విడుదలకు ముందు వరకు కల్కి చిత్రం ఎలా ఉంటుందనే అవగాహన లేదు. ట్రైలర్ కొన్ని సందేహాలు తీర్చింది. కల్కి అవుట్ అండ్ అవుట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చారు. కల్కి భవిష్యత్ లో వస్తాడు. ఆయన వచ్చేనాటికి ప్రపంచం ఎలా ఉంటుందో సృష్టించారని తెలుస్తుంది. కాగా యూఎస్ లో ఈ చిత్రం వసూళ్లు కుమ్మేస్తుంది. యూఎస్ ఆడియన్స్ కల్కి చిత్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే అర్థం అవుతుంది. రికార్డు స్థాయిలో కల్కి టికెట్స్ లక్ష యాభై వేలకు పైగా అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ $ 3 మిలియన్ దాటిపోయాయి. కల్కి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను కల్కి చాలా ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు.
కల్కి చిత్రం జూన్ 27న విడుదల అవుతుంది. ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, శోభన వంటి స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో సైతం పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.