సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శంకర్ వచ్చే నెలలో విడుదల కానున్న ఇండియన్ 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో, శంకర్ ని గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడమని అడిగారు. శంకర్ మాట్లాడుతూ... సినిమా దాదాపు పూర్తయింది. మరో 10 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇండియన్ 2 రిలీజ్ తర్వాత ప్రొడక్షన్ పార్ట్ పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజీని లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారిస్తాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేస్తాం అని అన్నారు. అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.